కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ మరోసారి
Published: Friday January 05, 2018

శుక్రవారం మరోసారి నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో శ్రీనివాస్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగే అవకాశం ఉంది. లైంగిక వేధింపుల కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న గజల్ శ్రీనివాస్‌కు కోర్టులో గురువారం కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు గురువారం తిరస్కరించింది.
మరోవైపు పంజగుట్ట పోలీసులు విచారణ నిమిత్తం నిందితుడిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో వేసిన కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. వీడియోలతో సహా అన్ని ఆధారాలుండగా మళ్లీ కస్టడీ అవసరమేంటని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. విచారణకు సంబంధించిన విషయాలన్నీ రిమాండ్ రిపోర్టులో వివరించిన తర్వాత... రికవరీ లాంటి ఎలాంటి అవసరం లేనప్పుడు కస్టడీ ఎందుకని న్యాయమూర్తి ప్రశ్నించారు.
