‘కత్తి రాష్ట్ర బహిష్కరణ దళితుల్ని అవమానించడమే
Published: Wednesday July 11, 2018

రౌడీలను, గూండాలను బహిష్కరించినట్టు... తెలంగాణ ప్రభుత్వం కత్తి మహేష్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరిపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. సంఘ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కుల వివక్ష చూపుతున్నారని, గతంలో అనేక మంది రచయితలు, హేతువాదులు రాముడిపై విమర్శలు చేశారని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోని తెలంగాణా ప్రభుత్వం కత్తి మహేష్‌ను రాష్ట్ర బహిష్కరణ చేయటం దళితుల్ని అవమానిం చటమేనని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం పునరాలోచించి మహేష్ రాష్ట్ర బహిష్కరణను రద్దు చేయాలని అన్నారు. సింగంపల్లి శ్రీను, పాల్వాయి దాసు, బుక్కా నరేష్ పాల్గొన్నారు.
