స్ర్కిప్టు మార్చేశారు....కాకినాడ ధర్మపోరాట సభలో లోకేశ్‌

Published: Saturday June 30, 2018

 ఎన్‌డీఏ నుం చి టీడీపీ బయటకు రాగానే జనసేన అధ్యక్షుడు పవ న్‌ కల్యాణ్‌ స్ర్కిప్టు మార్చేశారని మంత్రి లోకేశ్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం కాకినాడ ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్‌డీఏ నుంచి టీడీపీ ఎందుకు వైదొలగాల్సి వచ్చిందో పవన్‌కు తెలీ దా అని లోకేశ్‌ ప్రశ్నించారు. ఎన్‌డీఏలో టీడీపీ ఉ న్నంత కాలం సీఎం చంద్రబాబు కార్యదీక్షాపరుడు, మచ్చలేని నేత అని పొగిడిన పవన్‌కు ఇప్పుడు ఏ మైందని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీకి ఎప్పుడూ సీన్‌ లేదని, టీడీపీ పొత్తు వల్లే ఇక్కడ కనీస ఉనికి లభించిందని చెప్పారు. విభజన హామీలు నెరవేరుస్తారనే ఉద్దేశంతోనే బీజేపీతో జతకట్టామని, ప్రత్యేక హోదా ఇస్తారని నాలుగేళ్లు వేచి చూశామని, నెరవేర్చకపోగా చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై, సీఎంపై అర్థరహిత ఆరోపణలు చేస్తున్న పవన్‌, జగన్‌లకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని మోదీని నిలదీయాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జగన్‌ పవన్‌ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. కుట్ర రాజకీయాలు ఎదుర్కోవడం చంద్రబాబుకు తెలియని విషయం కాదని, రాజకీయాల్లో ఆరితేరిన అపర చాణుక్యుడని, కుప్పిగంతులు వేసేవారిని ఎలా ఆడించాలో ఆయనకు తెలుసని చెప్పారు

.