బాబు గోగినేనిపై కేసు నమోదు...
Published: Tuesday June 26, 2018

హైదరాబాద్: హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మతాన్ని కించపరిచేలా ఆయన యూట్యూబ్‌లో మాట్లాడారనే అంశంతో పాటు వారు చేపట్టే ప్రయివేటు కార్యక్రమం కోసం ఆధార్ నంబర్లను తీసుకోవడంపై కేవీ నారాయణ అనే వ్యక్తి ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం బాబు గోగినేనిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాబు గోగినేనిపై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
