పవన్‌ మద్దతు ఈసారి జగన్‌కే

Published: Saturday June 23, 2018

 జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తారని మాజీ ఎంపీ వరప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. శుక్రవారం తిరుపతి విమానాశ్రయంలో విలేకరులు ఆయన్ను ప్రశ్నించారు. పవన్‌ వైసీపీకి మద్దతిస్తారా అని అడుగగా.. మద్దతు ప్రకటిస్తే ఆహ్వానిస్తామని బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తామని పవన్‌ తనతోనే స్వయంగా అన్నారని తెలిపారు. చంద్రబాబు చేసే అవినీతి నచ్చకే జగన్‌తో కలవడానికి జనసేన అధినేత సిద్ధపడ్డారని చెప్పారు. పవన్‌ చంద్రబాబుతో విభేదించినందున వైసీపీతో కలిసే అవకాశం ఉందని అన్నారు.