ఈ సారి త్రివిక్రంపై మహెష్ కత్తి

ఎప్పుడూ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌పై, ఆయన ఫాన్స్ పై కత్తి మహేష్ తీవ్ర విమర్శలు చెసే కత్తి మహెష్. తాజాగా పవన్ స్నేహితుడు, మాటల మాంత్రికుడు అయినటు వంటి, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. త్రివిక్రమ్మసలు కాపి చెయిందె సినిమా చెయడని , అతను కాపి కేట్ అని సంబొధించాడు.
`త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే డైరెక్టర్ కాపీ కొట్టకుండా రాసిన, తీసిన సినిమా అసలు ఒకటి కుడా లెదు అని. కొన్ని సీన్లో, సీక్వెన్సులో, ఏకంగా కథ ఇలా ఏదో ఒకటి కాపీ చేస్తూనే ఉంటాడు అని కత్తి చెప్పారు. ఒక డైలాగ్ ఏదో ఆసక్తికరంగా ఉంటే, దాని చుట్టూ కొన్ని సీన్లు అల్లే ప్రయత్నం చేస్తుంటాడు. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలలో నుంచి కొన్ని వాక్యాల్ని, ఆలోచనల్ని అరువు తెచ్చుకుని తనదైన శైలిలో కొన్ని పదాలు అక్కడక్కడా కూర్చి మాయ చేసి మెప్పిస్తుంటాడు. మన ఖర్మ కొద్దీ ఆ మాత్రం రాసే రచయితలు ఎవరూ లేక అగ్రదర్శకుడిగా చెలామణి అయిపోతున్నాడ`ని మహేష్ కత్తి తన ట్విటర్ ఖాతాలొ పేర్కొన్నారు
