యువకుల మధ్య....మెసేజ్ వివాదం..

మేసెజ్ వివాదం యువకుల మధ్య ఘర్షణగా మారింది. దీంతో రెండు గ్రూపుల యువకులు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు యువకులు గాయపడ్డారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో శనివారం సాయంత్రం సంఘటన చోటు చేసుకోగా పోలీసులు అక్కడికి చేరుకుని గ్రూపులను బెదరగొట్టి గొడవను సద్దుమణిగించారు. అప్పటికే ఇద్దరి యువ కులకు గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీనివాసులును వివరణ కోరగా ఘర్షణ చోటు చేసుకున్నది వాస్తవమేనని, అయితే అందరూ విద్యార్థులు కావడంతోవారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని తెలిపారు. సెల్‌ఫోన్‌లో ఓ యువతికి పంపిన మేసేజ్ ఈ ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది.
