కేటిబి కళ్యాణ మండపానికి నిధుల కేటాయింపు

శ్రీ కృష్ణ దేవరాయ కళ్యాణ మండపాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సందర్శించారు ,ఈ సందర్భంగా కళ్యాణ మండపం పనులు పెండింగ్ కు గల కారణాలు తెలుసుకున్నారు ,నిధులు కొరత కారణం గా ఈ కళ్యాణ మండపం పనులు పూర్తి చేయలేకపోయామని ప్రతినిధులు ఎమ్మెల్యే కు వివరించడంతో ఆయన తక్షణమే స్పందించారు .మండపం పనులు పూర్తి చేయడానికి రూ .3.60 కోట్లు అవసరమౌతాయని సంభందిత ఇంజనీర్ అంచనాలను రూపొందించినట్టు కాపునాడు ప్రతినిధులు తెలిపారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తన అభివృద్ధి నిధుల నుంచి రూ.10 లక్షలను కేటాయించనున్నట్లు కమిటి సభ్యులకు భరోసా ఇచ్చారు .అంతే కాకుండా కాపు కార్పొరేషన్ నుంచి కూడా నిధులను మంజూరు చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో కాపునాడు ప్రతినిధుల మండలి అధ్యక్షులు శేషగిరిరావు ,గొల్లపల్లి సుభ్రమణ్యం,కరణం రెడ్డి నర్సింగరావు,కరణం కనకారావు,చిన్నారావు ,బేర వరహాలు ,పిల్లా వెంకటేశ్వరులు ,మంగవర ప్రసాద్,పాండ్రంగి జయరాజు ,రామునాయుడు,గంధం వెంకట్రావు,నీరుకొండ రామచంద్ర రావు,రాజానరామారావు ,కర్రి నాగేశ్వర్ రావు తదీతరులు పాల్గొన్నారు
