గజ్ ల్ శ్రినివాస్ హింసలకి చనిపొవాలని అనుకున్నాను : బాధితురాలు

హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగికంగా తనను లోబర్చుకొనేందుకు పెట్టిన హింసలను తట్టుకోలేక ఒకానొక సందర్భంలో చనిపోవాలని అనుకున్నాను అని బాధితురాలు చెప్పారు. అయితే సమాజంలో ప్రముఖుడిగా ముద్రపడిన గజల్ శ్రీనివాస్ చీకటి కొనాలు సాక్ష్యాలతో బట్టబయలు చేసేందుకు ప్రాణాలకు తెగించినట్టు ఆమె చెప్పారు.
అయితే గజల్ శ్రీనివాస్‌కు మరో మహిళ కూడ సహకరించిందని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరో మహిళను ఈ కేసులో ఎ2 గా చేర్చారు. అయితే ఈ కేసులో ఎ2 గా ఉన్న నిందితురాలు తనకు ఏ పాపం తెలియదంటున్నారు.ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గజల్ శ్రీనివాస్ తనను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో బాధితురాలు వివరించారు.
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పెట్టిన బాధలు భరించలేక ఒకానొక దశలో చావాలని భావించానని బాధితురాలు చెప్పారు,. ఉద్యోగం మానేయడానికి ప్రయత్నం చేస్తే తనపై నిందలు మోపుతానని గజల్ శ్రీనివాస్ బెదిరించారని ఆమె చెప్పారు. రెండు మాసాలుగా మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని బాధితురాలు బాధపడ్డారు .తనలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ధైర్యంతొ ఈ పని చెశానని చెప్పారు.
గజల్ శ్రీనివాస్ భార్యకు కూడ విషయాలను తాను చెప్పానని బాధితురాలు చెప్పారు. ఆపీసుకు వచ్చిన సమయంలో తన భార్యకు ఈ విషయాన్ని చెప్పానన్నారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న మరో మహిళ మీ స్థానాన్ని భర్తీ చేస్తోందని చెప్పానన్నారు.
పూర్తి ఆధారాలతో గజల్ శ్రీనివాస్ బండారాన్ని బట్టబయలు చేసినందుకు పోలీసులు తనను అభినందించి తనకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని పోలీసులు హమీ ఇచ్చారన బిధితురాలు చెప్పారు.
