Share this on your social network:
Published: Thursday May 31, 2018
మునగాల(నల్గొండ): టీవీ మీద పడి బాలిక మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని మాధవరం గ్రామంలో జరిగింది. మాధవరం గ్రామానికి చెందిన కేశగాని భూపాల్ కుమార్తె దీక్షిత(3) ఇంట్లో ఆడుతూ టీవీ ఉన్న టేబుల్ పైకి ఎక్కింది. ప్రమాదవశాత్తు టేబుల్ విరిగింది. దీంతో బాలికపై టీవీ పడి తలకు తీవ్ర గాయాలై మృతిచెందింది.