జనసేన పార్టీ పై ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు... ఉత్తరాంధ్ర ఇంచార్జ్ శివ శంకర్

KNR Channel : జనసేన పార్టీపై ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు చేస్తోందని జనసేన చేపట్టిన పోరాట యాత్రలో పోలీసులు ..
కనీస రక్షణ కల్పించలేదని జనసేన నేతలు తీవ్రంగా మంది పడ్డారు. పోరాట యాత్రకి శ్రీకారం చుట్టినప్పుడే పవన్ పర్యటించే ప్రాంతాల్లో
ముందుగానే పోలీస్ అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చిన.... పోలీస్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరించడం సరికాదని జనసేన
ఉపాధ్యక్షుడు.మహేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్యజమెత్తారు.ఇదికూడా ప్రభుత్వపాలనలో ఒక భాగమేనన్నారు .దీనికి నిదర్శనం శ్రీకాకుళంలో ఇచ్చాపురం ,
సోంపేట పర్యటనలో ఒక్క పోలీస్ కూడా కనిపించకపోవటమేనని అన్నారు అశేష జనసందోహం మధ్య ఏమైనా జరగరానిది జరిగితే మేమంతా రోడ్లమీదకు
వస్తామని దానికి పూర్తి భాద్యత ప్రభుత్వానిదే అని హెచ్చరించారు
యిదే విషయంలో జనసేన ఉత్తరాంధ్ర ఇంచార్జి శివశంకర్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రజాసమస్యల కోసం పోరాటంచేస్తున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న
తీరు సరికాదని వెంటనే భద్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
