మహిళల IPL మ్యాచ్ నేడే ........ ప్రారంభం
Published: Tuesday May 22, 2018

ముంబైః మహిళల ఐపీఎల్ దిశగా మంగళవారం తొలి అడుగు పడనుంది. వాంఖడే స్టేడియంలో చారిత్రక ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నేడే. తలపడుతున్న జట్లు ట్రయల్‌బ్లేజర్స్, సూపర్‌నోవా. ట్రయల్ బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, సూపర్‌నోవాస్‌కు హర్మన్‌ప్రీత్ నాయకత్వం వహించనున్నారు. మహిళల ఐపీఎల్ టోర్నీని ఆరంభించాలనే యోచనలో ఉన్న బీసీసీఐ అందుకు సన్నాహకంగా.. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది. అగ్రశ్రేణి విదేశీ మహిళా క్రికెటర్లు సుజీ బేట్స్ (న్యూజిలాండ్), అలిసా హీలీ, బేత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్ (ఆస్ట్రేలియా), డానియెలె వ్యాట్ (ఇంగ్లాండ్) ఈ మ్యాచ్‌లో ఆడునున్నారు. వాంఖడే స్టేడియంలో చెన్నై -హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 పోరుకు ముందు ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది.
