దుర్గ ఘాట్స్ లో ఇబ్బంది పడే మహిళలకు గదులు ఏర్పాటు ...కలెక్టర్ ఆదేశం
Published: Sunday May 20, 2018

విజయవాడ: దుర్గాఘాట్ పరిసర ప్రాంతాలను ఇటీవల కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పరిశీలించిన సందర్భంగా ఘాట్ నెలకొన్న కొన్ని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా దుర్గాఘాట్‌లో స్నానమాచరించిన భక్తులు దుస్తులు మార్చుకునే విషయంలో ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్ ఘాట్ సమీపంలో దుస్తులు మార్చుకునే గది ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు నిర్మాణ పనులు చేపట్టారు.
