విశాఖలో వైసీపీ 'వంచన వ్యతిరేక' దీక్ష
Published: Monday April 30, 2018

విశాఖపట్నం: హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి నిరసనగా వైసీపీ 'వంచన వ్యతిరేక' దీక్ష చేపట్టింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమీపంలో మహిళా జూనియర్ కళాశాల వద్ద దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన వైసీపీ నేతల దీక్ష రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది.
