ఆటో డ్రైవర్ హత్య కేసులో భార్యాభర్తలుసహా ముగ్గురి అరెస్టు
Published: Monday August 26, 2019

కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, ఏసుపురం గ్రామానికి చెందిన కుక్కల నాగశ్రీను(20) కూడా అదే ప్రాంతంలో నివసిస్తూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్‌యాదవ్, ప్రవీణ్, నాగశ్రీనుది ఒకే ఫీల్డ్ కావడంతో కలిసి ఉండేవారు. శ్రీకాంత్‌కి మొదటి నుంచి క్రిమినల్ మైండ్. ఆధిపత్యం చాటుకోవాలనే తపన ఎక్కువ. వాణీనగర్‌లో 2017లో ఐలయ్య అనే వ్యక్తితో ప్లాట్ విషయమై గొడవపడ్డాడు. అతడిని గాయపరిచి జైలుకెళ్లాడు. అనంతరం ప్రవీణ్ ఐలయ్యకు దగ్గరయ్యాడు. ఐలయ్య విషయంలో శ్రీకాంత్ చేసిన పని సరైంది కాదని ప్రవీణ్ మిత్రులతో చెప్పాడు. ప్రవీణ్ ఐలయ్యకు దగ్గరయ్యాడని.. జాగ్రత్తగా ఉండమని శ్రీకాంత్‌ను మిత్రులు హెచ్చరించారు. ఈ విషయంలో ప్రవీణ్-శ్రీకాంత్ మధ్య నాలుగు నెలల క్రితం గొడవ జరిగింది. ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చి కలిసి ఉందామనుకున్నారు. ప్రవీణ్‌తో జాగ్రత్తగా ఉండాలని, అతడు నిన్ను చంపుతాడేమోనని నాకు భయంగా ఉందంటూ శ్రీకాంత్‌ను భార్య హెచ్చరించింది.
పథకం ప్రకారం...
ఈనెల 22వ తేదీన ప్రవీణ్ వాణీనగర్‌లో ఉన్న స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి వెళ్తున్నాడు. అదే ప్రాంతంలో ఉన్న శ్రీకాంత్, నాగశ్రీను అదేం పార్టీ.. మేము ఇస్తామంటూ బుల్లెట్‌పై ప్రవీణ్‌ను ఎక్కించుకొని బొల్లారం చౌరస్తాకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగి పార్టీ చేసుకున్నారు. రాజేష్ రూ. 10 వేలు ఇవ్వాలని చెప్పి ప్రవీణ్, నాగశ్రీనును తీసుకొని శ్రీకాంత్ బొల్లారం చౌరస్తాకు వెళ్లి ఆటోతో ఉన్న రాజేష్‌ను కలిశారు. అక్కడి నుంచి అందరూ బయలుదేరారు. ప్రవీణ్ ఆటో తోలుతుండగా రాజేష్ వెనుక కూర్చున్నాడు. బుల్లెట్‌పై శ్రీను, శ్రీకాంత్ దాని వెనుకే వెంబడిస్తూ దీప్తిశ్రీనగర్‌లో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అక్కడ రాజేష్‌ను బెదిరించాలని ప్రవీణ్‌కు చెప్పారు. ఆటోలో నుంచి రాజేష్‌ను బయటకు లాగిన ప్రవీణ్ అతడి చేయి పట్టుకున్నాడు. శ్రీను మరో చేయి పట్టుకున్నాడు. ప్రవీణ్‌ను చంపుతానని శ్రీకాంత్ ఆ రోజు భార్య స్వాతికి హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే పథకం ప్రకారం చున్నీని ప్రవీణ్ మెడకు చుట్టి కింద పడేశాడు. అప్పటికే శ్రీను ప్రవీణ్ రెండు కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు.
ఏమి జరుగుతుందో తెలియని రాజేష్ భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. స్నేహితులకు విషయం చెప్పి మియాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే ప్రవీణ్ తల నరికేసిన శ్రీకాంత్ మొండాన్ని అక్కడే వదిలేసి తలను బొల్లారం చౌరస్తాలో ఆటో స్టాండ్ వద్ద పెట్టి శ్రీకాంత్, శ్రీను పారిపోయారు. అక్కడి షాపుల యజమానుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాంత్‌యాదవ్, శ్రీను, స్వాతిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించామని, వారి నుంచి ఆటో, బుల్లెట్, కత్తి, చున్నీ, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు.
