దేవుడా.........కూల్ డ్రింక్ లో కూడా దారుణాలు
Published: Sunday April 29, 2018

విజయవాడ, వన్‌టౌన్: ప్రముఖ కూల్‌డ్రింక్ కంపెనీకి చెందిన సీసాలో గుట్కా ప్యాకెట్, ఇతర వ్యర్థాలు ఉండటంతో రెస్టారెంట్‌లో ఉన్న వారు అవాక్కయ్యారు. కూల్‌డ్రింక్ కొనుగోలు చేసిన వి.రమేష్ అనే వ్యక్తి రెస్టారెం ట్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా, వారి సూచనల మేరకు ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మధురానగర్‌కు చెందిన వి.రమేష్ తన స్నేహితులతో కలిసి బీఆర్టీఎస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. భోజనం పాటు కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేశారు. రమేష్ కూల్‌డ్రింక్ సీసా మూత తీయటానికి ప్రయత్నించగా సీసాలో ఉన్న గుట్కాప్యాకెట్, ఇతర వ్యర్థాలు కనిపించాయి. దీనిపై కూల్‌డ్రింక్ డీలర్‌కు ఫిర్యాదు చేయగా, స్పందించకపోవడంతో ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు రెస్టారెంట్‌కు వెళ్లి ఆ సీసాను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
