టీడీపీ అర్బన్ కార్యాలయం మార్పు... కేశినేని భవన్ ఖాళీ
Published: Tuesday August 13, 2019

టీడీపీ విజయవాడ అర్బన్ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి ఖాళీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుమతితో అర్బన్ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి తాత్కాలికంగా ఆటోనగర్ గురునానక్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయానికి మార్చినట్టు టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి కొమ్మా రెడ్డి పట్టాభిరామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్బన్ టీడీపీ సొంత కార్యాలయం ఏర్పాటయ్యే వరకు అర్బన్ నేతల సమావేశాలు, పార్టీ కార్యక్ర మాలను జిల్లా పార్టీ కార్యాలయం నుంచే నిర్వహించనున్నట్టు వివ రించారు. ఇక నుంచి తనతో పాటు అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంక న్న, కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు పార్టీ జిల్లా కార్యాల యంలో అందుబాటులో ఉంటారని పట్టాభిరామ్ తెలిపారు.
నగర పరిధి లోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల నాయకులు, ఆయా డివిజన్ల అధ్య క్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్త లు, శ్రేణులు ఈ మార్పును గమనించి అర్బన్ పార్టీ కార్యక్రమాలను జయప్ర దం చేసేందుకు సహకరించాలని కోరారు. టీడీపీ అర్బన్ కార్యాలయాన్ని కేశినేని భవన్ నుంచి ఖాళీ చేయడంపై ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ట్విట్టర్ వేది కగా స్పందించారు. ‘‘లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్’’ (తక్కువ సామాను, మరింత సౌకర్యం) అంటూ ఆయన ట్వీట్ చేశారు. కేశినేని భవన్ నుంచి టీడీపీ అర్బన్ కార్యాలయాన్ని ఖాళీ చేయడం తనకే మంచి దన్నట్టు ఎంపీ కేశినేని పోస్టు చేసిన ట్వీట్ టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
