దేశంలోనే అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం
Published: Tuesday August 06, 2019

కశ్మీర్ ఎజెండాలోని తొలి అంకాన్ని బీజేపీ-సారథ్య ప్రభుత్వం విజయవంతంగా పూర్తిచేసింది. దీని ప్రకారం... ఇన్నాళ్లూ రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్ ఇక దేశంలోనే అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం గా అవతరించబోతోంది. కార్గిల్, లద్దాఖ్ అనే 2 జిల్లాలు మాత్రమే ఉన్న పర్వత ప్రాంతం ‘లద్దాఖ్’ పేరిట మరో కేంద్రపాలిత ప్రాంతం గా మారుతోంది. అవిభాజ్య జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ పదవీకాలం ఆరేళ్లుండేది. ఇక అన్ని రాష్ట్రాల్లో మాదిరే ఐదు సంవత్సరాలే ఉంటుం ది. అవిభక్త కశ్మీర్లో సీట్ల సంఖ్య 111. ఇందు లో లద్దాఖ్‌లో ఉన్న 4 సీట్లు కూడా ఉన్నాయి. లద్దాఖ్‌ను తీసేస్తే ఈ సీట్ల సంఖ్య 107గా ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మరో 7 సీట్లు కలిపి ఈ సంఖ్యను 114కు పెంచుతామని బిల్లును ప్రవేశపెడు తూ అమిత్ షా ప్రకటించారు. అయితే ఇన్నాళ్లూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 87 మాత్రమే. 24 స్థానాలు ప్రస్తుతం పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్లో (పీవోకే) ఉన్నాయి.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి త్వరలోనే డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. అది ఇచ్చే నివేదిక ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చేస్తారు. రిజర్వేషన్లు కూడా వర్తింపజేస్తామని కేంద్రం ప్రకటించింది. అంటే గుజ్జర్లు, వాల్మీకి కులస్తులు సహా ఎస్టీలకు కొన్నిసీట్లు దక్కుతాయి. ఒకవేళ పండిట్లు తిరిగొస్తే వారికి కూడా కొన్ని సీట్లు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో మెజారిటీలు ముస్లింలు.. మైనారిటీలు హిందువులు. కేంద్ర రాయితీలన్నీ మైనారిటీ కోటా కింద మెజారిటీ ముస్లింలకే దక్కుతున్నాయి. కశ్మీర్ లోయ అందులో ఒకటి. ఈ దృష్ట్యా మైనారిటీగా ఉన్నవారికే ఫలం దక్కేట్లు చూసేందుకు పండిట్లకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. వీరితో పాటు ఎస్సీలకు కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేయవచ్చు. 2026 దాకా లోక్‌సభ నియోజకవర్గాల పెంపు జరపరాదన్న నిబంంధన ఉన్నందున ప్రస్తుతం ఉన్న 6 సీట్లు కొనసాగుతాయి. ఇందులో ఒకటి లద్దాఖ్‌కు పోతే మిగిలేవి 5 కశ్మీర్‌కు చెందుతాయి.
