గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ
Published: Tuesday August 06, 2019

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని, అధినేత నారా చంద్రబాబునాయుడును ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని ఆ పార్టీ సీనియర్ నేత పీ సాయిబాబు తెలిపారు. తాజాగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి అరవింద్‌కుమార్‌గౌడ్‌తో కలిసి చంద్రబాబును కలిసిన సందర్భంగా ఈ విషయంపై చర్చ జరిగిందని ఆయన చెప్పారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా పార్టీ కోసం పని చేస్తున్న వారి వివరాలను అధినేతకు అందజేశామన్నారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా టీడీపీని తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సాయిబాబు పేర్కొన్నారు. బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటోందని, రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయంగా ఎదిగే సత్తా టీడీపీకి మాత్రమే ఉందని న్నారు. బాబును కలిసిన వారిలో బాలరాజుగౌడ్, నల్లెల కిషోర్, శ్రీపతి సతీష్, ముప్పిడి మధుకర్ ఉన్నారు.
