విశాఖ జిల్లాలో లారీ బీభత్సం: ఒకరు మృతి
Published: Tuesday March 20, 2018

విశాఖపట్టణం: జిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడు జంక్షన్‌లో ఉదయం ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది. రోడ్డుపక్కన ఉన్న పాదచారులపైకి ఒక్కసారిగా వేగంగా దూసుకురావడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు హూటాహుటిన అక్కడకు చేరుకున్నారు. కాగా... మృతుని వివరాలు తెలియరాలేదు.
