రేషన్ బియ్యంలో నూకలు తగ్గిస్తాం
Published: Thursday August 01, 2019

రేషన్ బియ్యంలో నూకలను 15 శాతానికి తగ్గిస్తామని మంత్రి కొడాలి నాని చెప్పారు. బుధవారం విజయవాడలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కార్డుదారులకు ప్యాకింగ్‌లో నాణ్యమైన బియ్యాన్ని ఇంటి వద్దకే చేరుస్తామని చెప్పారు. రేషన్‌కార్డులు లేని వారి నుంచి అర్జీలు తీసుకుని, 3 రోజుల్లో కార్డులు ఇస్తామన్నారు. బియ్యంలో నూక శాతాన్ని 15కు తగ్గించి, మిల్లు వద్దనే ప్యాకింగ్ చేసి చౌకధరల దుకాణాలకు తరలిస్తారన్నారు
