చంద్రబాబుకు పట్టిన గతే జగన్‌కూ పడుతుంది
Published: Friday July 26, 2019

‘‘జగన్ 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కాని మేం చేపట్టిన 36 కిలోమీటర్ల యాత్రకు అనుమతి ఇవ్వకపోవటం హాస్యాస్పదం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చిలకపలుకులు పలికారు. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఆపని చేసిన చంద్రబాబుని ప్రజలు ఇంటికి పంపారు. ఇప్పుడు ఆ గతే జగన్‌కూ పడుతుంది’’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలను విరమించుకోవాలని కృష్ణ మాదిగ కోరారు. ఈ వ్యాఖ్యాలను విరమించుకోవాలని గాంధేయ మార్గంలో ఈ నెల 20న గుంటూరు నుండి అసెంబ్లీ వరకు ఎస్సీ వర్గీకరణ సాధన యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అన్నారు. 30న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఏ రూపంలోనైనా ముట్టడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
