అన్ని పార్టీలు ముందుకు రావాలి: ఎంపీ రామ్మోహన్‌నాయుడు..
Published: Monday March 19, 2018

న్యూఢిల్లీ : అవిశ్వాసానికి మిగతా పార్టీల మద్దతు కూడగడుతున్నామని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని చెప్పారు. అన్ని పార్టీలు ఏపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చంద్రబాబు ముందుకు రాగానే సీనియర్ నేతలు మద్దతు తెలపడం శుభపరిణామమన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఎంపీలతో సంతకాలు చేయించి స్పీకర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నామని ఎంపీ రామ్మోహన్‌నాయుడు చెప్పుకొచ్చారు.
