బడ్జెట్ ప్రకటనకు భిన్నంగా ఆర్థిక బిల్లు
Published: Monday July 08, 2019

పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బడ్జెట్‌లో చెప్పింది ఒకటి.. ఆర్థిక బిల్లులో పొందుపర్చింది మరొకటి! పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.2 సుంకాలు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. కానీ, మరో రూ.5 పెంచేందుకు వీలుగా ఆర్థిక బిల్లును రూపొందించింది. దీన్ని బట్టి చూస్తే మున్ముందు మళ్లీ పెట్రో బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 మాత్రమే పెంచాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించినా, అదను చూసి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ప్రత్యేక అదనపు పన్ను (ఎస్‌ఏడీ) రూపాయి, రహదారులు, మౌలిక వసతుల సుంకం మరో రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు.

దీన్ని బట్టి లీటరు పెట్రోల్‌కు ఎస్‌ఏడీ రూ.8కి, డీజిల్‌పై రూ.2కు పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ రెండింటిపైనా సుంకం రూ.9కు పెరుగుతుంది. బడ్జెట్ ప్రకటనలను చట్టంగా మార్చే ఆర్థిక బిల్లు వద్దకు వచ్చేసరికి మాట మారిపోయింది. ఈ పన్ను, సుంకం ఇంకా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం మార్గం తెరిచి ఉంచుకుంది. లీటరు పెట్రోల్‌పై ఎస్‌ఏడీ రూ.7 నుంచి రూ.10కి, డీజిల్‌పై రూపాయి నుంచి రూ.4కు పెంచేందుకు వీలుగా ఆర్థిక బిల్లులోని 185వ క్లాజ్‌లో పొందుపర్చింది. అలాగే 201వ క్లాజ్‌లో రహదారులు, మౌలిక వసతుల సెస్సు రూ.8 నుంచి రూ.10కి పెంచేలా నిర్దేశించింది. ఈ రెండూ కలుపుకుంటే పెట్రోల్, డీజిల్‌పై పన్నులు లీటరుకు మరో రూ.5 పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రూ.2 పెంచినా, ప్రభుత్వం కావాలనుకున్నప్పుడు మరింత పెంచుతుంది.
దీనిపై రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మాట్లాడుతూ సీలింగ్ మాత్రమే పెంచామని, ప్రతిసారీ సీలింగ్ మార్చుకుంటూ పోవడం సాధ్యం కాదు కాబట్టే ఇలా చేశామని చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల పెంపుతో ఏడాదికి రూ.30 వేల కోట్లు వస్తాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 9 నెలల్లో దాదాపు రూ.22 వేల కోట్లు రావచ్చని చెప్పారు.
