టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి
Published: Saturday June 22, 2019

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించిం ది. ఈ మేరకు దేవదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్ర భు త్వ హయాంలో ఏర్పాటైన బోర్డును రద్దు చేసింది. ఆ బోర్డులోని సభ్యుల్లో ముగ్గు రు రాజీనామా చేయకపోవడంతో దానిని రద్దు చేసి, కొత్త చైర్మన్‌గా సుబ్బారెడ్డిని నియమించింది. చైర్మన్‌గా ఆయన శనివారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. నూతన పాలకమండలిలోని మిగతా సభ్యులను త్వరలోనే నియమిస్తామని తెలియజేసింది. కాగా, టీటీడీ బోర్డు ఏర్పాటుపై శుక్రవారం హడావుడి నడిచింది. ఇప్పటి వరకూ చైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం రాజీనామా చేశారు. దీంతో కొత్తబోర్డు నియామకానికి మార్గం సుగమమైందని అంతా భావించారు. కానీ, బోర్డులోని ముగ్గురు సభ్యులు రాజీనామ చేయకపోవడంతో ఏం చేయాలన్నదానిపై అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. వారిని అలాగే ఉంచి కొత్త చైర్మన్‌ను నియమిస్తే, అది పాత పాలకమండలే అవుతుంది. అప్పుడు కొత్త చైర్మన్ పదవీకా లం ప్రస్తుత బోర్డులో మిగిలిన 9 నెలల కాలమే ఉంటుంది. పైగా రాజీనామా చేయని సభ్యులు కొనసాగుతారు. మరోవైపు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా వైవీ సుబ్బారెడ్డి శుక్రవారమే తిరుపతి చేరుకుని సిద్ధంగా ఉన్నారు.
దీంతో అప్పటికప్పుడు న్యాయసలహా తీసుకున్న దేవదాయశాఖ మొత్తం పాత బోర్డును రద్దుచేసింది. చైర్మన్‌తో సహా ఇప్పటివరకూ మొత్తం 11మంది రాజీనామా చేశారని, ఒక సభ్యుడు తిరిగి ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో అనర్హులయ్యారని, మరో ముగ్గు రు అధికారులు ఉన్నారని, వీరుకాక ఇంకా ముగ్గురు సభ్యులు రాజీనామా చేయాల్సి ఉందని వివరించింది. బోర్డు సమావేశానికి కనీసం ఐదుగురు సభ్యుల కోరం ఉండాలని, కానీ ప్రతిసారీ కొంతమంది సభ్యుల గైర్హాజరవుతున్నందున కొద్దిమంది సభ్యులతో పాలకమండలిని నడిపించడం కష్టమవుతుందని తెలియజేసింది. ఈ నేపథ్యం లో టీటీడీ పాలన సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈవో ప్రభుత్వాన్ని కోరినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ పాత బోర్డును రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకముందు కొందరు సభ్యులు చేసిన రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. సుధా నారాయణమూర్తి, సుగవాసి ప్రసాద్‌బాబు, రుద్రరాజు పద్మరాజు, ఇ.పెద్దిరెడ్డి, డొక్కా జగన్నాథంలు చేసిన రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు తెలిపింది. వీరితో పాటు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న ఎన్.శ్రీకృష్ణ, బి.అశోక్‌రెడ్డిల రాజీనామాలనూ ఆమోదించింది.
