జనసేన ఎమ్మెల్యేకు శ్రీకాంత్‌రెడ్డి వార్నింగ్

Published: Tuesday June 18, 2019
 వైసీపీ, బీజేపీ మిత్రపక్షాలని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించడాన్ని చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తప్పుబట్టారు. వరప్రసాద్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నేడు శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాము బీజేపీతో కలిసి పోటీ చేయలేదని.. పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు.
జనసేన ఎమ్మెల్యే ఏదిపడితే అది మాట్లాడితే కుదరదని శ్రీకాంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీతో జనసేన అంతర్గత పొత్తు విషయం అందరికీ తెలుసని విమర్శించారు. కేంద్రంతో పొట్లాడే పరిస్థితి లేదని, సఖ్యతగా ఉంటూ హోదా సాధనకు కృషి చేస్తున్నామని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.