ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్,
Published: Tuesday April 30, 2019

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సూర్యనారాయణపురం దగ్గర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్నది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ట్యాంకర్ దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. విశాఖ నుంచి ఏలూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
