మహిళా సంఘాల ఉచ్చులో రాం గొపాల్ వర్మ
Published: Monday February 19, 2018

‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా విషయంలో పోలీసు విచారణ ఎదుర్కొన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వర్మ ల్యాప్‌టాప్‌లోని రహస్యాలను వెలికితీసేందుకు సీసీఎస్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వర్మ వద్ద నుంచి స్వాదీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపించారు. ప్రాథమిక నివేదిక కోసం సీసీఎస్ పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆపిల్ ల్యాప్‌టాప్ కావడంతో లాక్ డీకోడ్ చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. కాగా, పోలీసుల విచారణకు హాజరైన వర్మ.. జిఎస్‌టి సినిమా డైరెక్షన్ అంతా స్కైప్ ద్వారానే జరిగిందని పోలీసులకు వర్మ తెలిపారు. వర్మ చెప్పిన అంశాలపై నిర్ధారణ కోసం సీసీఎస్ పోలీసులు స్కైప్‌కు లేఖ రాశారు.
