‘తూర్పు’ ఏజెన్సీలో పోలింగ్ ప్రశాంతం
Published: Friday April 12, 2019

నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ లోతట్టు ప్రాంతంలో పోలింగ్ సామగ్రి తరలింపు కోసం రెండు హెలికాప్టర్లను వినియోగించారు. సాధారణ ప్రాంతాల్లో ఈవీఎంల తరలింపు కోసం ఆర్టీసీ బస్సులు సహా పోలీసు వాహనాలు వినియోగిస్తుండగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో తొలిసారి హెలికాప్టర్లను వినియోగించారు. వై.రామవరం మండలం గుర్తేడు, దారగడ్డ, పాతకోట, బొడ్డగండిల్లో ఏడు పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్, సెక్టోరల్ అధికారులతో పాటు ఈవీఎంలను కాకినాడకు తరలించడానికి ఓఎన్జీసీకి చెందిన రెండు హెలికాప్టర్లను వినియోగించారు. సాయంత్రం 4 గంటలకే ఏజెన్సీలో పోలింగ్ ముగించి.. 5.30 గంటలకు ఈవీఎంలను, సిబ్బందిని సురక్షితంగా కాకినాడ తీసుకొచ్చినట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.
