ఒక్కసారే కదా అని ఎవరైనా సైనెడ్ తాగుతారా
Published: Monday April 01, 2019

‘తండ్రికి చాన్స్ ఇస్తే ఏకంగా ఉమ్మడి రాష్ట్రాన్ని మింగేశాడు. ఇక కొడుక్కి చాన్స్ ఇస్తే జనాన్ని బతకనిస్తాడా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంలో టీడీపీతో వైసీపీ పోటీపడలేదని, అందుకే అరాచకాలకు, అల్లర్లకు బరి తెగిస్తోందని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఒక్కసారే ప్లీజ్ అంటే.. క్రూర మృగం చెంతకు ఎవరైనా వెళ్తారా? అని ప్రశ్నించారు.
‘ఒక్కసారే కదా అని తెలిసి తెలిసి ఎవరైనా లోయలోకి దూకుతారా? ఒక్కసారే కదా అని ఎవరైనా సైనెడ్ తాగుతారా? తప్పులు చేసే వాడికి ఒక్క చాన్స్ ఎవరైనా ఇస్తారా?. మన రూ.లక్ష కోట్ల ఆస్తులు లాక్కున్న కేసీఆర్‌తో జగన్ దోస్తీ చేస్తున్నారు. పోలవరంపై కేసులు వేసే టీఆర్‌ఎ్‌సకు వైసీపీ మద్దతిస్తోంది. జగన్ తన ఆస్తులు, బంధువుల ఆస్తుల కోసం రాష్ట్రాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు. లోటస్ పాండ్ లాభాల కోసం ఏపీకి జగన్ అన్యాయం చేశారు. సొంత లాభాల కోసమే మోదీ, కేసీఆర్‌లతో జగన్ దోస్తీ చేస్తున్నారు. ఆంధ్రులను అవమానించిన టీఆర్‌ఎస్ నేతలకు జగన్ మద్దతిస్తున్నారు. కియపై మోదీకి కితాబివ్వడం జగన్ మరో సెల్ఫ్‌గోల్. జగన్ చేస్తు న్న మోదీ భజన బీజేపీనేతలను మించిపోయింది. బీజేపీ, టీఆర్‌ఎస్, వైసీపీల లాలూచీని ప్రజల్లో ఎండగట్టాలి’ అని చంద్రబాబు కోరారు.
‘రాష్ట్రం కోసం, పార్టీ కోసం ఏకతాటిపై పని చేయాలి. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే టీడీపీతోనే సాధ్యం. 25 ఎంపీ, 150పైగా అసెంబ్లీ సీట్లు టీడీపీ మిషన్. గెలుపు ఏకపక్షం కావాలి. కార్యకర్తలు, నాయకుల్లో ఇంకా సీరియ్‌సనెస్ రావాలి. తుది ఓటర్ల జాబితా విడుదలైం ది. అన్ని ఓట్లు తనిఖీ చేసుకోవాలి. రేపు ఈవీఎం దొంగలను కూడా ఎదుర్కోవాలి. గత ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు పార్టీకి తెచ్చిన వారికే పదవు ల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తాం’ అని టీడీపీ కార్యకర్తలకు చెప్పారు.
