గాజువాకలో రౌడీయిజం చేస్తే తాట తీస్తా

వైసీపీ అధ్యక్షుడు జగన్.. అమిత్ షా, బీజేపీ పార్టనర్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. శనివారం ఆయన గాజువాక నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. అగనంపూడిలో ప్రారంభమైన రోడ్‌షో దువ్వాడ, రాజీవ్‌నగర్, వడ్లపూడి, తుంగ్లాం మీదుగా షీలానగర్ వరకూ సాగింది. ఈ సందర్భంగా రాజీవ్‌నగర్‌లో ఆయన మాట్లాడారు. జగన్, టీడీపీ అవినీతి తాట తీసింది జనసేన పార్టీయే అన్నారు. చంద్రబాబు, జగన్‌లు తమను గెలిపించాలని అడుగుతున్నారని, తాను మాత్రం ప్రజలను గెలిపించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. చంద్రబాబు రోజుకో మాటమార్చే సీఎం అని తెలిపారు. కేసీఆర్‌తో మాట్లాడితే వైసీపీ, టీఆర్‌ఎస్‌తో కలిసి ప్లాన్ చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తారని.. వైసీపీ నాయకులేమో తనను టీడీపీ పార్టనర్ అని అంటున్నారని చెప్పారు. పిచ్చిమాటలు కట్టిపెట్టాలని టీడీపీ, వైసీపీ నేతలను హెచ్చరించారు. ప్రజలు కోరుకుంటే మార్పు వస్తుందన్నారు. గాజువాకలో రౌడీయిజం చేస్తే తాట తీస్తానని పవన్ హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్, చంద్రబాబే రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు. తాను గాజువాక నుంచి సరికొత్త విప్లవానికి నాంది పలుకుతానన్నారు. అభిమానుల కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. గాజువాకకు సబం ధించిన 64 ప్రధాన సమస్యలు, హామీలతో మేనిఫెస్టోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
