4 కోట్ల విలువైన బంగారం..వజ్రాలు సీజ్
Published: Wednesday March 20, 2019

ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వ హించిన తనిఖీల్లో మంగళవారం రూ.4 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, రూ.1.36 కోట్లకుపైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. చిత్తూరు జిల్లా కొల్లాగుంట చెక్‌పోస్ట్ వద్ద కార్వేటినగరం ఓ వాహ నంలో 12 కిలోల బంగారం, 60 చిన్న వజ్రాలు కనిపించడంతో సీజ్ చేశారు. వాటి విలువ రూ.4 కోట్లుటుందని తెలిపారు. చెన్నైలోని మలబార్ గోల్డ్ షాపు నుంచి తిరుపతి, నెల్లూరు దుకాణాలకు వీటిని తరలిస్తున్నట్లు వాహనంలోని సిబ్బంది తెలిపారు. వీటిని జిల్లా ఎన్నికల అధికారికి అప్ప గించామని ఎస్‌ఐ శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం పాతరోడ్డు మలుపు వద్ద విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న కారును ఎస్‌ఎస్‌టీ(స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్) ఇన్‌చార్జి షేక్ బాబూరావు సిబ్బంది తో కలసి తనిఖీ చేయగా ట్రంకు పెట్టెలో కోటి రూపాయలు(రూ.5 లక్షలు చొప్పున 20 బండిల్స్) నగదు కనిపించింది.
డ్రైవర్ మాణిక్యాలరావుతోపాటు కారులో ఉన్న మల్లేశ్వరరావు అనే వ్యక్తిని ప్రశ్నించగా విశాఖపట్నం సీతంపే ట ఏపీజీవీబీ(ఏపీగ్రామీణ వికాస్ బ్యాంక్) నుంచి పాడేరు ఏపీజీవీబీ బ్రాం చికి తరలిస్తున్నట్టు చెప్పారు. అయితే సంబంధిత పత్రాలు చూపకపోవడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకొని, నగదు, కారు సీజ్ చేశారు. బ్యాంకు అధికారులు సరైన పత్రాలు చూపించి, సొమ్ము తమదిగా నిరూపించుకోవల సి ఉంటుందని, సకాలంలో ప్రక్రియ పూర్తికాకుంటే నగదును ట్రెజరీకి తరలిస్తామని చెప్పారు. కారు నంబరు ప్లేటుపై టీడీపీ స్టిక్కర్ ఉండడంతో సొ మ్ము ఆ పార్టీ నాయకులదిగా భావించారు. అయితే సంబంధిత బ్యాంకు అధికారులు వచ్చి విషయం చెప్పడంతో రాజకీయ పార్టీది కాదని అధికారు లు నిర్థారణకు వచ్చారు. మరోవైపు పాడేరు పోలీసులకు సమాచారం ఇచ్చా మని బ్యాంకు అధికారులు చెప్పారు. సొమ్ము తరలించడంలో ఇంత అజా గ్రత్త ఏమిటని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎన్.ప్రభాకరరెడ్డి, ఈవోపీఆర్డీ సూర్యనారాయణ పాల్గొన్నారు.
