ఆ టికెట్‌పై రూ.5 కోట్లు
Published: Sunday March 17, 2019

ఎన్నికల కంటే ముందుగానే పందేలు జోరందుకుంటున్నాయి. అది ఫలితాల మీద కాదు... టీడీపీ టికెట్‌పైన. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఎవరికి టికెట్ దక్కుతుందనే విషయమై బెట్టింగ్ జోరందుకుంది. లక్షకు రూ.3 లక్షల చొప్పున కోసు పందెం జరుగుతోంది. 20 రోజులుగా జరుగుతున్న బెట్టింగులు శనివారం మరింత పెరిగాయి.
పందెం ఇప్పుడు రూ.5కోట్లు దాటిందని అంచనా. దీనిలో ఒక అభిమాని మాధవనాయుడిపై రూ.30 లక్షల వరకూ కాసినట్టు ప్రచారం జరుగుతోంది. కొత్తపల్లి వర్గంలోనూ ఒకరిద్దరు రూ.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ కాశారు. కొద్ది రోజుల నుంచి నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌పై ఉత్కంఠ నెలకొంది. మాధవనాయుడికే టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. కొత్తపల్లి వర్గీయులు కూడా అధిష్టానం నుంచి తమ నేతకు హామీ వచ్చిందని అంటున్నారు. ఉభయ వర్గాల నడుమ పంతాలు పెరిగి.. పందెం వరకూ వెళ్లింది.
