ఆదినారాయణరెడ్డే హత్య చేయించారు
Published: Sunday March 17, 2019

తిరుమల: పరిటాల రవి హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. జమ్మలమడుగులో ఓడిపోతారనే భయంతో టీడీపీ నేత ఆదినారాయణరెడ్డే హత్య చేయించారని ఆమె ఆరోపించారు. జగన్‌నను మానసికంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేశారని రోజా విమర్శించారు.
