రజినితో పొత్తుపై కమల్ ఆసక్తికర వ్యాక్యాలు
Published: Monday February 12, 2018

కెరీర్ తొలినాళ్లలో కలిసి నటించిన రజినీకాంత్, కమల్ హాసన్ ఆ తర్వాత దక్షిణాదిన స్టార్ హీరోలుగా ఎదిగారు. ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయ్యారు. సినీ రంగంలో సమాంతరంగా ఎదిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు రాజకీయాల్లోకీ ఒకేసారి ప్రవేశం చేయబోతున్నారు. వీరిద్దరూ చెరొక పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి పోటీ చేస్తారా, ప్రత్యర్థులుగా మారతారా అనేది ఇప్పుడు తమిళనాట సస్పెన్స్‌గా మారింది.
తాజాగా రజినీ పార్టీతో పొత్తు గురించి కమల్ మాట్లాడారు. ఆమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీలో ప్రసంగం ఇచ్చిన కమల్.. రాజకీయాల్లో రజినీతో పొత్తు గురించి మాట్లాడారు. `రజినీకాంత్, నేను మంచి స్నేహితులం. అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. రజినీ రాజకీయాల్లో కాషాయ రంగు (బీజేపీ) ఎక్కువగా కనబడుతోంది. అది వదిలించుకుంటేనే నేను రజినీతో కలిసి పనిచేస్తాను. లేకపోతే మేం కలిసి పనిచేయడం జరగద`ని కమల్ స్పష్టం చేశారు
