ప్రత్యేకహోదా విషయంలో మోసం చేసిన మోదీ
Published: Wednesday February 27, 2019

ప్రత్యేకహోదా విషయంలో మోసం చేసిన మోదీని ఐదు కోట్ల ఆంధ్రులు విలన్‌లా చూస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామన్న రాహుల్‌గాంధీని హీరోలా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, సినీనటి ఖుష్బూ తదితరులతో కలిసి ఆంధ్రరత్న భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి, కోట్లాది రూపాయలను దోచుకుంటున్న ప్రధాని మోదీని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విజయవాడ జైల్లో పెడతామని రఘువీరా శపథం చేశారు. పళ్లంరాజు మాట్లాడుతూ మోదీకి జగన్ మిత్రుడా.? హోదాకు వ్యతిరేకా.? అని ప్రశ్నించారు. ఖుష్బూ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో మోదీ తన సొంత ఇమేజ్ పెంచుకోవడానికి రూ.4600 కోట్లు ఖర్చు చేశారన్నారు.
