లారీడు సెల్‌ఫోన్ల దోపిడీ
Published: Thursday February 14, 2019

కావలి: నెల్లూరు శ్రీసిటీ నుంచి మొబైల్ ఫోన్లను తరలిస్తున్న లారీని మంగళవారం రాత్రి ఓ ముఠా హైజాక్ చేసింది. అందులోని రూ.4.79 కోట్ల విలువగల 4,340 సెల్‌ఫోన్లను మరో రెండు లారీల్లోకి ఎక్కించుకుని పరారైంది. నెల్లూరులోని శ్రీసిటీ సెజ్ నుంచి రెడ్‌మీ కంపెనీకి చెందిన సెల్‌ఫోన్లతో మినీ కంటెయినర్ లారీ మంగళవారం సాయంత్రం కోల్‌కతాకు బయలుదేరింది. కొడవలూరు మండలంలోని గమేషా కంపెనీ వద్ద గుర్తుతెలియని కారు లారీకి అడ్డుగా వచ్చి ఆగిపోయింది. మరో రెండు మినీ లారీలు కంటెయినర్ లారీకి రెండువైపులా ఆగిపోయాయి. డ్రైవర్ మహ్మద్ ఇంతియాజ్ లారీని రివర్స్ తీసేందుకు ప్రయత్నించగా మరో కారు లారీ వెనుక ఆగింది.
ఇంతియాజ్ లారీ డోర్లు లాక్ చేసుకోగా, ఐదుగురు వ్యక్తులు ఆ డోర్ అద్దాలను పగలగొట్టి అతనిపై దాడిచేశారు. హైవే వెంబడి దగదర్తిలోకి ప్రవేశించారు. అక్కడ లారీ ఆపి ఇంతియాజ్ చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టి ఓ కారులో తిప్పారు. కంటెయినర్ లారీలో ఉన్న మొబైళ్లను రెండు లారీల్లోకి లోడ్ చేసుకుని పరారయ్యారు. వీరి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
