మద్యం షాపుల్లో సీసీ కెమెరాలు
Published: Tuesday February 12, 2019

ఎన్నికల సమయంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ వేటు తప్పదని ఆ శాఖ కమిషనర్ ఎంకే మీనా హెచ్చరించారు. సర్వీస్ తొలగింపునకూ వెనుకాడబోనన్నారు. సోమవారం అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఈఎ్‌సలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నాలుగైదు నెలలు కీలకమని, ఈసీ నిఘా ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం షాపులు సమయపాలన పాటించాలని, ప్రతి షాపులో సీసీ కెమెరా ఏర్పాటుచేసి, దానిని కమిషనర్ కార్యాలయానికి అనుసంధానం చేయాలని సూచించారు.
