నిధుల వాపస్‌పై మరింత గడువు
Published: Friday February 08, 2019

అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు ఇచ్చి.. వెనక్కి తీసుకోవడానికి గల కారణాలను వివరించేందుకు కేంద్రానికి హైకోర్టు మరికొంత గడువు ఇచ్చింది. కేంద్రం చర్యను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై తగిన వివరణ ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
