మూడు రోజుల పాటు పలు రైళ్ల రద్దు
Published: Sunday February 03, 2019

గూడూరు: దక్షిణ మధ్య రైల్వేలోని గూడూరు జంక్షన్ పరిధిలో యార్డు అభివృద్ధి పనుల్లో భాగంగా ఆదివారం నుంచి మూడు రోజులపాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గూడూరు-తిరుపతి నడుమ నడిచే మెమూ ప్యాసింజర్‌ను ఈనెల నుంచి 5వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తిరుపతి- గూడూరు మెమూ ప్యాసింజర్‌ను 4నుంచి 6 వరకు రద్దు చేశారు.
గూడూరు-రేణిగుంట మెమూ ప్యాసింజర్ 4 నుంచి 6 వరకు, రేణిగుంట- గూడూరు ప్యాసింజర్ 4 నుంచి 6 వరకు, బిట్రగుంట-చెన్నయ్ సెంట్రల్ ప్యాసింజ ర్‌ను 3 నుంచి 5 వరకు, చెన్నయ్ సెంట్రల్- గూడూరు ప్యాసింజర్ 3 నుంచి 5 వరకు రద్దు చేశారు. ఇదిలా ఉండగా, గూడూరు- విజయవాడ ప్యాసింజర్‌ను గూడూరు, బిట్ర గుంట స్టేషన్ల నడుమ 4 నుంచి 6 వరకు తాత్కాలిక రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
