పార్లమెంటులో సెగ పుట్టించిన టిడీపి ఎంపీలు

విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం లోక్‌సభలో నోటీస్ ఇచ్చారు. 193వ నిబంధన కింద టీడీపీ ఎంపీలు నోటీస్ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ గత కొద్దిరోజులుగా టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. అంతేగాక మిత్రధర్మం పాటిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ప్రతికా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ-బీజేపీల మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వెలువడ్డ నేపధ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీలు నోటీస్ ఇవ్వడం చర్చానీయాంశమైంది.
టీడీపీకి బాసటగా నిలిచిన అకాళీదళ్ పార్టీ
ఇదిలా ఉండగా టీడీపీ ఎంపీలకు అకాళీదళ్ పార్టీ బాసటగా నిలిచింది. టీడీపీ డిమాండ్లలో న్యాయం ఉందని అకాళీదళ్ ఎంపీ నరేష్ అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే డిమాండ్లను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు సహకరిస్తామన్న ఎంపీ నరేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా... విభజన హామీల సాధనకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న టీడీపీ నిర్ణయాన్ని శివసేన పార్టీ ఇదివరకే స్వాగతించిన సంగతి తెలిసిందే.
