ఆందోళనల్లో ప్రజలందరికీ భాగస్వామ్యం
Published: Thursday January 31, 2019

రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా ప్రయోజనాలు, విభజన హామీల సాధన కోసం చేస్తున్న ధర్మపోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. ఫిబ్రవరి 11న సహచర మంత్రులతో కలిసి అక్కడ ఒక రోజు దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చయించారు. మర్నాడు 12న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను అఖిల పక్ష నేతలు కలిసి రాష్ట్రానికి జరిగిన అ న్యాయాన్ని వివరిస్తారు. బుధవారం సచివాలయంలో తన కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వివిధ రూపాల్లో రాష్ట్రంలో నిరసనలు సాగించాలని సీఎం పిలుపిచ్చారు. దీనికోసం అఖిలపక్షం తరపున కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీకి ‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీల జేఏసీ’ అని పేరు పెట్టారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, ఉద్యో గ, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో పోరాట కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. బుధవారం నాటి అఖిలపక్షానికి రాని పార్టీలను కూడా కలిసి ఈ జేఏసీలోకి ఆహ్వానించాలని సీఎం సూచించారు. 1వ తేదీన రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన చేపట్టాలని, 11న ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించా రు. ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం తెలిపారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ ఆందోళనల్లో 5 కోట్ల మంది ప్రజలను భాగస్వాములను చేయాలి. అన్ని వర్గాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తే అది గొప్ప ప్రజాఉద్యమంగా మారుతుంది. దీనిని రాజకీయ పోరాటంగా భావించకూడదు. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వంపై చేసే పోరాట కార్యక్రమంగానే ఈ ఉద్యమాన్ని తీసుకోవాలి. రాష్ట్రానికి న్యాయం జరగాలి.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. ఆంధ్రతో అనవసరంగా పెట్టుకున్నామనే భయం ఢిల్లీ పెద్దల్లో కలగాలి’ అని పేర్కొన్నారు. ఇంకా ‘మంగళవారం ఉండవల్లి అరుణ్‌కుమార్ నిర్వహించిన సమావేశానికీ ప్రతిపక్ష వైసీపీ ఎందుకు రాలేదు? ఈ పనులన్నీ ఎవరి మేలు కోసం చేస్తున్నారు? జైలుకెళ్లి కూర్చుంటారు, కానీ అఖిలపక్షానికి రారు. ప్రతిపక్షాల వైఖరిలో మార్పురాకపోతే ప్రజలే వారి సంగతి చూస్తారు. హైదరాబాద్‌లో ఉంటున్న సెలబ్రిటీలు వ చ్చి ఆందోళనలో పాల్గొనాలని కోరుకోవడం సబబు కా దు. వారి ప్రయోజనాలు వారికి ఉంటాయి. స్వచ్ఛందం గా వస్తే కలుపుకొని పోవాలి’
‘ప్రత్యేక హోదా సాధనకు నేను చేయాల్సిదంతా చేశాను. హోదా చట్టంలో అంశాల అమలుకు విశ్వప్రయత్నాలు చేశాం. చివరకు రెవెన్యూ లోటు భర్తీకి కూడా ఇంతవరకు సరిగా నిధులివ్వలేదు. పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.4,000 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోగా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కితీసుకోవడం దారు ణం. కేంద్రం రాష్ట్రానికి రూ. 1,03,980 కోట్లు ఇవ్వాల ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ చెప్పా రు. కేంద్రం నుంచి రూ. 74,500 కోట్లు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించిన కమిటీ నివేదిక ఇచ్చింది. చట్టంలో పేర్కొన్న అంశాలపై, ప్రత్యేక హోదాపై తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మాట మార్చింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. పెరిగిన అంచనా వ్యయాన్ని భరిస్తామని అప్పటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఆఖరి మంత్రిమండలి సమావేశంలో ఆమోదించింది. ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమైతేనే శ్రద్ధగా చేస్తుందని చెప్పి మనకు అప్పగించారు. తర్వాత లేనిపోని దురుద్దేశాలు అంటగట్టారు. విశాఖ రైల్వేజోన్ ఇవ్వడానికి కేంద్రానికి ఇబ్బందేంటి?’
