అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు..
Published: Tuesday January 29, 2019

లక్షల మంది డిపాజిటర్లను మోసం చేసిన కేసులో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 33 ఆస్తులను ఏపీ సీఐడీ జప్తు చేసింది. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో వీటిని గుర్తించిన సీఐడీ అధికారులు అటాచ్ చేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సర్కారు పచ్చజెండా ఊపింది. మరో 118 ఆస్తులు రాష్ట్రంలోని 6 జిల్లాల్లో గుర్తించినట్లు సీఐడీ చీఫ్ అమిత్ గార్గ్ తెలిపారు.
