విశాఖలో భారీ జాతీయ పతాకం
Published: Saturday January 26, 2019

జాతీయ ఓటర్ల దినోత్సవం, 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విశాఖలో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్‌వర్క్స్ ఆధ్వర్యంలో ‘జెండా ఊంఛా రహే హమారా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 25 వేల చ.అ. భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. వేలాది మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని జాతీయతను చాటారు. మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్వాహకులను అభినందించారు.
