26, 27న గుంటూరు జిల్లాలో పవన్ పర్యటన

Published: Friday January 25, 2019

గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఈనెల 26, 27న జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 26న మంగళగిరిలో జరుగనున్న గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే 27న రింగురోడ్డులో జిల్లా ఆఫీస్‌ను ప్రారంభించి, అనంతరం ఎల్ఈఎం గ్రౌండ్‌లో బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్ పాల్గొంటారు