ఢిల్లీకి జనఘోష రైలు యాత్ర

‘విభజన చట్టంలోని హమీల అమలుపై ఈ నెల 27న ఢిల్లీకి ‘జన ఘోష’ రైలు యాత్ర చేపడుతున్నాం. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలున్నాయి. అంతకంటే ముందే ఆంధ్రుల జనఘోషను కేంద్రం దృష్టికి, వివిధ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లడానికి యాత్ర చేపట్టాం’’ అని ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ వెల్లడించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘గత ఏడాది జనవరి 27న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాం. 48 గంటల పాటు రైలులోనే నిరసనను కొనసాగించి గాంధీ సమాధి వద్ద విరమించాం. ఈసారి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉత్తరాంధ్ర చర్చావేదిక సభ్యులంతా నల్ల దుస్తులు ధరిస్తారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను, పార్లమెంట్‌లోని వివిధ రాజకీ య పక్షాల ఫ్లోర్ లీడర్లను, రాష్ట్ర ఎంపీలను కలిసి వినతి పత్రాలను సమర్పిస్తాం. ఢిల్లీలో 5 రోజులపాటు పలు రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం’’ అని కొణతాల రామకృష్ణ వివరించారు.
