షర్మిల ఫిర్యాదుపై సీసీఎస్ డీసీపీ
Published: Thursday January 17, 2019

వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై చేపట్టిన దర్యాప్తులో యూట్యూబ్, ఫేస్‌బుక్‌తోపాటు మొత్తం 10 వెబ్‌సైట్లను గుర్తించినట్లు సైబర్ క్రైం అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ కేసును వ్యక్తిగత, రాజకీయ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, 2 వారాల్లో నిందితులను పట్టుకుని దర్యాప్తు పూర్తి చేస్తామన్నారు. పోస్టులు పెట్టిన వా రితోపాటు వారిని ప్రోత్సహించిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. హీరో ప్రభా్‌సతో సంబంధం ఉందంటూ కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్‌కు షర్మిల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
