చేతులకు సరిపడా ‘ఉపాధి’...

Published: Sunday January 06, 2019
 ఉపాధి హామీ పథకం జాతీయస్థాయిలో తొలిసారి మన రాష్ట్రంలోనే అమలయింది. అయితే, గత నాలుగున్నరేళ్లలో ఈ పథకానికి సమగ్రత చేకూరడంతోపాటు, విస్తృతి పెరిగింది. వ్యవసాయ కూలీలకు ఉపాధిని హామీ పడటంతో మొదలయిన ఈ పథకం, అనంతరకాలంలో గ్రామాల్లో శాశ్వత ఆస్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచింది. ఇప్పుడు అదే పథకం అన్నదాతలకు అండగా నిలిచింది. మెటీరియల్‌ కాంపోనెంట్‌ ద్వారా మిగిల్చిన నిధులను రైతుల ఆదాయం పెంచడానికి వినియోగించే దిశగా.. ఈ పథకం పరుగు అందుకొంది. ఈ పథకాన్ని సమగ్రంగా అమలు చేయడంతోపాటు భిన్న ఆలోచనలతో పరిధిని ఎప్పటికప్పుడు విస్తరించడంలోను రాష్ట్రం ముందంజలో ఉంది.
 
దీనికితోడు పక్కా ప్రణాళికలు, ప్రైవేటు సిబ్బంది చిత్తశుద్ధి, సాంకేతిక వినియోగం మరింతగా కలిసివచ్చాయి. వాస్తవానికి ఉపాధి హామీ ప థకం అమలు పంచాయతీలతో ముడిపడింది. అ యితే, మన దేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థను నమ్ముకొంటే.. పథకం ప్రయోజనాన్ని అందరికీ చేర్చలేమని మొదట్లోనే ఉమ్మడి ప్రభుత్వం గుర్తించింది. ఉపాధి హామీ పథకం నిబంధనలను ధిక్కరించకుండానే, బలమైన ప్రైవేట్‌ యంత్రాంగాన్ని సమాంతరం గా రూపొందించింది.
 
ఈ పథకం అమలు ద్వారా లభించే 6 శాతం నిర్వహణా వ్యయంతో ఈ యం త్రాంగాన్ని తెరపైకి తెచ్చింది. అలాగే, టీసీఎస్‌ సహకారంతో ఈ పథకానికి అత్యంత మెరుగైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. కూలీల మస్టర్లను కాగితాల్లో రాసే ప్రక్రియ నుంచి మొబైల్‌, ట్యాబ్‌, కంప్యూటర్లను ఉపయోగించి కాగిత రహిత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ పనుల్లో అక్రమాలకు తావు లేకుం డా 3 రకాల వ్యవస్థలను రం గంలోకి దించారు. నాణ్యతానియంత్రణ కోసం క్వాలిటీ కం ట్రోల్‌, ప్రతి ఆర్నెల్లకు ఒకసా రి పనులు తనిఖీ చేసేందుకు సోషల్‌ ఆడిట్‌, పనుల ప ర్యవేక్షణ చేసేందుకు అంబుడ్సమెన్‌ వ్యవస్థ తెచ్చారు.