టీచర్‌పై సీఐ ప్రతాపం
Published: Saturday January 05, 2019

ఓ టీచర్‌పై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రతాపం చూపాడు. స్టేషన్‌కు తీసుకొచ్చి.. దుస్తులు విప్పేసి కసి తీరా కొట్టాడు. కడప జిల్లా రాజంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేటలో ఇటీవల దివాలా తీసిన చిట్‌ఫండ్ కంపెనీ డైరెక్టర్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అతడికి నందలూరులో కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న వి.శివయ్య జామీను ఇచ్చి బయటకు తీసుకువచ్చారు. ఆ డైరెక్టర్ మళ్లీ స్టేషన్‌కు వెళ్లకపోవడంతో శివయ్యకు బుధవారం రాత్రి సీఐ కబురు పంపారు.
తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి రావడంతో శివయ్య స్టేషన్‌కు వెళ్లలేకపోయాడు. దీంతో గురువారం తెల్లవారుజామున శివయ్యను పట్టణ సీఐ సూర్యనారాయణ స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శివయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో.. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, టీచర్ల ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు ఆస్పత్రికి చేరుకొని శివయ్యను పరామర్శించారు. జరిగిన ఘటనపై మేడా మల్లికార్జునరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
