వేసవి రద్దీ ద్రుష్ట్యా 68 ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం- సికింద్రాబాద్, విశాఖపట్నం- తిరుపతి మధ్య 68 ప్రత్యేక రైళ్లు నడపను న్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.
విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ (రైల్ నెంబర్: 08501) విశాఖపట్నం నుంచి మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26వ తేదీల్లో (మంగళవారం) రాత్రి 11గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో... సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ (రైల్ నెంబర్: 08502) సికిందాబ్రాద్ నుంచి మార్చి 7, 14, 21, 28, ఏప్రిల్ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27వ తేదీల్లో (బుధవారం) సాయంత్రం 4.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.50గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్ (రైల్ నెంబర్: 08573) విశాఖపట్నం నుంచి మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25వ తేదీల్లో (సోమవారం) రాత్రి 10.55గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.25గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో..తిరుపతి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ (రైల్ నెంబర్: 08574) విశాఖపట్నం నుంచి మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26వ తేదీల్లో మధ్యాహ్నం 3.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.50గంటలకు విశాఖపట్నం చేరుతుంది
